Pages

Telugu Kiranaalu - పొడుపు కథలు

అన్నదమ్ములు ఇద్దరు, ఒకరంటే మరొకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వారి మధ్యకు ఎవరైనా వొస్తే పచ్చడి పచ్చడే? - ఇసుర్రాయి
ఇక్కడ వత్తు! అక్కడ వెలుగు!!? -  స్విచ్, బల్బ్
ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము? - పంచదార
ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి?- మ్యాపులో
ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది? - చీపురు
అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే, పరుగెత్తలేక పది మంది చచ్చారు. - పిడుగు
అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురూ తిరుగుతారు, మానితే ముగ్గురూ మానుతారు? - ఫ్యాన్
బంగారు చెంబులో వెండి గచ్చకాయ? - - పనసగింజ
కుడితి తాగదు, మేత మేయదు. కానీ, కుండకు పాలిస్తుంది? - తాటిచెట్టు
కాళ్లు లేవు కానీ నడుస్తుంది. కళ్లు లేవు కానీ ఏడుస్తుంది? -మేఘం
కాళ్లు, చేతులు ఉన్నా, నడవలేనిది? - కుర్చీ 
తోలు నలుపు, తింటే పులుపు - చింతపండు
తనను తానే మింగి మాయమవుతుంది? - మైనపు వత్తి 
ఎర్రటిపండు మీద ఈగైనా వాలదు. - నిప్పు  
కాళ్లు, చేతులు ఉన్నా, నడవలేనిది? - కుర్చీ 
తోలు నలుపు, తింటే పులుపు - చింతపండు
తనను తానే మింగి మాయమవుతుంది? - మైనపు వత్తి 
ఎర్రటిపండు మీద ఈగైనా వాలదు. - నిప్పు
ఏడెకరాల మాను, రంగు రంగుల మాను. వంగి నీళ్లు తాగుతుంది? - ఇంద్రధనస్సు
ఏ రాయి వద్దన్నా ఈ రాయి కావాలి అందరికీ. ఇంతకీ, ఏ రాయి అది? - ఉప్పురాయి 
ఇల్లు ఒకటి, వెళ్లడానికి రెండు దారులు? - ముక్క 
ఎముకలు ఉండవు. కానీ, నిచ్చెన ఎక్కుతుంది. ఏమిటది? - పేను 
అయిదుగురిలో బుడ్డాడు, పెళ్లికి మాత్రం పెద్దోడు? - చిటికెన వేలు 
నిప్పు నన్ను కాల్చలేదు. నీరు నన్ను తడపలేదు. సూర్యుడితో వస్తాను, సూర్యుడితో పోతాను? - నీడ 
తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి, అన్న పరిగెత్తుతూ పన్నెండు మైళ్లు నడుస్తాడు? - గడియారం ముళ్లు
జానెడు ఇంటిలో మూరెడు బెత్తం - కుండ, గరిటె
అందరినీ పైకి తీసుకెళ్తుంది... తాను మాత్రం ఉన్నచోటే ఉంటుంది. - నిచ్చెన
ఇష్టంగా తెచ్చుకుంటారు ... చంపి ఏడుస్తారు. - ఉల్లిపాయ
నాలో బోలెడు నదులున్నాయి. కానీ నీళ్లు మాత్రం లేవు ఎన్నో దారులున్నాయి కానీ ఏ వాహనము పోదు. ఎన్నో దేశాలున్నాయి కానీ భూమిని కాదు, మరి ఎవరిని? - ప్రపంచపటం
అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ తినలేరు? - కంచం
నన్ను వేసే వాళ్లే కానీ తీసేవాళ్లు లేరు? - గోడకు సున్నం
అరిచి గోలపెట్టే రాళ్లు - కీచురాళ్లు
నీరు లేని సముద్రాన్ని భద్రంగా దాటించే ఓడ - ఒంటె 
చిత్రమైన చీరకట్టి షికారుకెళ్లిందో చిన్నది పూసిన వారింటికే గాని, కాసిన వారింటికి పోనే పోదు. - సీతాకోక చిలుక
కాటుక రంగులో ఉంటాను, కమలాన్ని పోలి  ఉంటాను. విప్పితే పొంగుతాను.  ముడిస్తే కుంగిపోతాను. నేనెవరు? గొడుగు
పండునే కానీ, నన్ను తినలేరు నా పిల్లల్ని తింటారు. నన్ను గుర్తు పట్టారా? పనస పండు 
వేర్వేరు రంగుల్లో, ఆకారాల్లో ఉండే నేనంటే పిల్లలకు ఎంతో ఇష్టం. నన్ను సులభంగా ఎత్తుకోగలరు. వదిలితే మాత్రం పారిపోతాను. నేనెవరు? బెలూన్ 
నలుపు-తెలుపు రంగుల్లో  ఉంటాను.రెక్కలున్నా ఎగరలేను, పక్షినే అయినా ఈత కొట్టగలను. నా పేరేంటి?
ఎర్రని ముక్కు, తెల్లని వొళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది?   క్రొవ్వొత్తి 
తాళి గాని తాళి, ఏమి తాళి? ఎగతాళి
తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు? గడియారం ముళ్ళు    
తిరిగే దీపము, గాలి-వానకు ఆగని దీపము, చమురులేని దీపము, పిట్టల దీపము? మిణుగురు పురుగు  
జారు కాని జారు, ఏమి జారు?  బజారు  
జాబు కాని జాబు, ఏమి జాబు?  పంజాబు
తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు!!?  విభూతి   
డ్రస్ కాని డ్రస్, ఏమి డ్రస్? అడ్రెస్  
టూరు కాని టూరు, ఏమి టూరు?  గుంటూరు
ముడ్డి పిసికి, మూతి నాకుతారు? మామిడి పండు
అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు? నిచ్చెన       
రంగం కాని రంగం, ఏమి రంగం? వీరంగం
రాణాలనే మించిన రణం, ఏమి రణం? మరణం
 వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు?  ఉడత      
తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది?   చీమ, దోమ  
తాళము కాని తాళము, ఏమి తాళము?  ఆది తాళము    
తోక లేని పిట్ట తొంభై  ఆమడలు పోతుంది?  పోస్ట్ కార్డు  
టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి? గడియారం  
మత్తు కాని మత్తు, ఏమి మత్తు? గమ్మత్తు    
చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ? కజ్జికాయ       
పిల్లికి ముందు రెండు పిల్లులు , పిల్లికి వెనక రెండు పిల్లులు, పిల్లికి పిల్లికి మధ్య ఒక పిల్లి  మొత్తం ఎన్ని పిల్లులు . - 3 పిల్లులు 
చిటపట చినికులు చిటారు చినుకులు ఎంత కురిసిన వరదలు రావు. - కన్నీళ్లు 
ఓలంతా ముల్లు  కడుపంత చేదు. - కాకరకాయ
కిట కిట తలుపులు కితారు తలుపులు తీసిన వేసిన చప్పుడు కావు  ఏమిటవి? -  కంటి రెప్పలు
అడుగులు ఉన్న కాలు లేనిది ఏది ? - స్కేల్ 
అడవిలో పుటింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వొచింది , మహాలక్షిమీలాగుంది. - గడప
ముళ్లపొదల్లో మిఠాయి పొట్లం తీయాలంటే కావాలి చాకచక్యం. - తేనె పట్టు
చిక్కని చెరువు చిక్కని నీళ్లు తెల్లని కాడ ఎర్రని పువ్వు. - దీపం
గ్రామానికి సింహాలుగా పిలవబడతారు వారు,  కొందరు విశ్వాసానికి పాత్రలు. ఎవరువారు? - కుక్కలు
పచ్చని చేలు పరిమళాల పిట్టా ఒళ్ళు విరుచుకుంది తెచ్చుకుందాం అంటే గుచ్చుకుంది. ఏమిటది? - మొగలి పువ్వు
పగలేమో కటోర తపస్వి రాత్రి భయంకర రాక్షసి. నేనెవర్ని? - గబ్బిలం
నల్లని రూపమంటూ నాలుగు చెవులు తింటే కరకర నాలుక చురచుర మంట.  ఏమిటది? - లవంగం
చుక్కలు చుక్కల రాణిని బంగారు వెన్నెల ప్రాణిని బిత్తర చూపులు దానిని చెంగుచెంగున దూకి దాన్ని. నేనెవర్ని ? - జింక లేడి
అందరి కంటే అందగాడు రోజుకొక లాగా తయారవుతాడు ఆఖరుకు నిండుసున్నా అవుతాడు.  ఏమిటది? - చంద్రుడు
అందమైన కోట లో నాట్యం చేసే అందగత్తె.  ఏమిటది? - నాలుక
దానికి ఆకలి వెయ్యదు దాహం అవ్వదు ఎవరిని ఇంటి లోనికి రానివ్వకుండా కాపలాగా ఉంటుంది.  ఏమిటది? - తాళం
మీరు నా నుంచి ఎంత తీసుకుంటే నేను అంత పెద్ద గా తయారవుతాం.  ఏమిటది? - గొయ్యి
మేమిద్దరం సోదరులను ఒక తల్లి బిడ్డలం ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరిని మిమ్మల్ని కలుస్తాను. ఎవరువారు? - పగలు,  రాత్రి
తెల్లని మొక్క ఎర్రగా పూసి పరిమళించే మాయమైపోతుంది. ఏమిటది? - కర్పూరం
అది కారు కాని కారు ఇంధనం అవసరమే లేదు పరుగులు మహా జోరు కాని రోడ్డు తో పనిలేదు. ఏమిటది? - పుకారు
నేను ఒక పండు నాలో పోషకాలు నిండు నాపేరు జంతువు వలే  ఉండు.  ఏమిటది? - డ్రాగన్ ఫ్రూట్
పండు ముళ్ళ పండు పట్టుకుంటే గుచ్చుకుంటుంది తినమంటే తీయగనుండు. ఏమిటది? - అనస పండు పైనాపిల్
నీవు ఎంతో అవసరమని వేస్తారో అంతలోనే అవసరం లేదని తీసేసారు అలాంటిదానిని నేను నేను ఎవరిని? - కరివేపాకు 
ఆకు చిటికెడు కాయ మూరెడు.  ఏమిటది? - మునగకాయ
పొద్దున తలుపు తట్టి ఉత్సాహాన్ని ఇచ్చేవాడు జీతం తీసుకోకుండా శుభ్రంగా చేసేవాడు ఆరోగ్యంతో ఆహ్లాదాన్ని పంచేవాడు. - సూర్యుడు
సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు.  ఏమిటది? - సూది
పళ్ళు నా నోరు లేనిది.  ఏమిటది? - రంపం
చేతికి దొరకనిది ముక్కుకు  దొరుకుతుంది ఏంటది? -  వాసన
నాలుగు కర్రల మధ్య నల్ల రాయి.  ఏమిటది? - పలక
కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది? - నీడ
అరచేతిలో అద్దం ఆరు నెలల యుద్ధం - గోరింటాకు
ముక్కుకి ముత్యం కట్టుకుని తోకతో నీళ్ళు తాగుతుంది ఏంటది? - దీపం
అందరినీ పైకి తీసుకెళ్ళి తను మాత్రం పైకి వెళ్లలేదు ఏమిటది? - నిచ్చెన
సంతల నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటది? - త్రాసు 
వేయ కనులు ఉండు ఇంద్రుడు కాదు కాలు నాలుగు ఉండు పశువు కాదు నరుడు పటుకుంటే నడప గలదు. ఏమిటది? - మంచం
అందమైన చెరువులో ముద్దొచ్చే పీట మూతి బంగారం తోకతో నీళ్ళు తాగు. ఏమిటది? - దీపం
తోక లేని పిట్ట తొంభై కోసులు పోతుంది. ఏమిటది? - ఉత్తరం
ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్ని ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది. ఏమిటది? - విస్తరాకు
 ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకుని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు ఏమిటది? - తాళం
అరచేతి కి 60 తూట్లు - జల్లెడ
పొట్టి వాడికి పుట్టినంత బట్టలు - ఉల్లిపాయ
అమ్మ తమ్ముడుని కాదు కానీ మీ అందరికీ మేనమామని నేనెవర్ని - చందమామ    
రాజు గారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారు లేరు ఏమిటవి? - నక్షత్రాలు
నాకు కన్నులు చాలా ఉన్నాయి కానీ చూసేది రెండుతోనే నేనెవరు? - నెమలి 
నామము ఉంది గాని పూజారిని కాదు వాలం(తోక ) ఉంటుంది కానీ కోతిని కాను నేను ఎవర్ని? - ఉడుత
అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్లలేను నేను ఎవరు? - నిచ్చెన
రెక్కలుంటాయిగానీ పక్షి కాదు. గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు. ఏమిటది? -  ఫ్యాను 
నాలుగు కాళ్లున్నాయి కానీ జంతువుకాదు. రెండు చేతులున్నాయి కానీ మనిషికాదు. ఏమిటది? - కుర్చీ 
వేలెడంతే ఉంటుందిగానీ, మనం ఇంట్లోకి రావాలంటే అది ఉండాల్సిందే?  - తాళం చెవి
పచ్చని పెట్టెలో విచ్చుకోనుందీ, తెచ్చుకోపోతేను గుచ్చుకుంటుంది. - మొగలి పువ్వు
చెట్టుచూడు, చెట్టందం చూడు, చిత్రమైన చిగురాకును చూడు, పూసిందంటే ఒకటే పూవు చూడు, కాసిందంటే గంపెడు కాయలు చూడు. - ఆకాశం, వెన్నెల, చంద్రుడు, చుక్కలు
తెలిసేటట్లు పూస్తుంది... తెలియకుండా కాస్తుంది? - వేరుశెనగ
ఒకటి పట్టి ఎత్తితే... రెండు ఉయ్యాల లూగుతాయి? - త్రాసు
బంగారం, వెండి గనులు ఒకే గుహలో కన్పిస్తాయి. - కోడిగుడ్డు 
వేపకాయంత బంగారం, అరచేతిలో పట్టడం కష్టం. - నిప్పు 
సన్నని పిల్ల వందల చీరలు కట్టి మందమయ్యింది? - ఉల్లిపాయ 
ఆకారంలో ఉన్నప్పుడు అందగాడు. పక్షం రోజుల్లో పరార్? - చంద్రుడు 
కాళ్లు చేతులు ఉన్నా నడవలేనిది? - కుర్చీ
ఎందరు ఎక్కినా విరగని మంచం - అరుగు
అంగుళం ఆకు... అడుగున్నర కాయ - ములక్కాయ
నూరుమంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు - చీపురు 
చాపను చుట్టలేం, పైసలు లెక్కపెట్టలేం - ఆకాశం, నక్షత్రాలు 
అరచేతికి  అరవై తూట్లు - జల్లెడ
ఆకలేయదు, నీరుతాగదు, నేలని పాకదు ..ఏమిటా తీగ?. (విద్యుత్తు తీగ)
ఆ కొండకు, ఈ కొండకు ఇనప సంకెళ్లు. ( చీమల దండు)
ఆకలేయదు, నీరుతాగదు, నేలని పాకదు ..ఏమిటా తీగ?. (విద్యుత్తు తీగ)
తోకలేని పిట్ట ఊరంతా తిరిగింది. (ఉత్తరం)
తోవలో పుట్టింది, తోవలో పెరిగింది, తోవలో పోయేవారి కొంగు పట్టింది. (ముళ్ల మొక్క)
ఆ ఆటకత్తె ఎప్పుడు లోపలే నాట్యం చేస్తుంది. ( నాలుక)
ఆకాశం లో అరవై గదులు. గదికో సిపాయి, సిపాయికో తుపాకీ. ( తేనెపట్టు)
ఆకాశాన పటం, కింద తోక … ( గాలి పటం)
చిటపట చినుకులు చిటారి చినుకులు ఎప్పుడు రాలిన చప్పుడు కావు. ( కన్నీరు)
ఇంటి వెనుక ఇంగువ చెట్టు, ఎంత కోసినా తరగదు. (పొగ)
అమ్మకి తమ్ముడిని కాను, కానీ నేను మీకు మేన మామని? (చందమామ)
పోకంతా పొట్టోడు, ఇంటికి గట్టోడు. ( తాళం కప్ప)
ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు. (కల్లు కుండలు)
నామముంది కానీ పూజారి కాదు, వాలముంది కానీ కోతి కాదు. (ఉడుత)
ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. (దీపం)
పైన చుస్తే పండు, పగుల గొడితే బొచ్చు. (పత్తికాయ)
నీళ్ళల్లో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది. (ఉప్పు)
శివరాత్రి కి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. (మామిడి పిందె)
గాడి నిండా రత్నాలు, గదికి తాళం. (దానిమ్మ పండు)
తెల్లని పోలీసుకి నల్లని టోపీ. (అగ్గిపుల్ల)
పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక. (మిరప పండు)
కానరాని విత్తనం, ఘనమైన చెట్టు. (మర్రిచెట్టు)
ఒక స్తంభానికి నలుగురు దొంగలు. (లవంగం)
నాలుగు కర్రల మధ్య నల్లని రాయి.  (పలక)
చక్కనమ్మ చిక్కినా అందమే. (సబ్బు)
దొంతర దొంతర దుస్తులు, బంగారు వన్నె జుట్టు, కలిగిన తల్లికి ఎంతో అందమైన పిల్లలు. (మొక్కజొన్న కంకి)
కొంచమైనా కాన రాని పసుపు, వొళ్ళంతా పులుపు,పైనేమో నునుపు? (నిమ్మ పండు)
నగరాలూ, పట్టణాలు దాటేస్తుంది,ఎంతెంత దూరమైనా వెళుతుంది, కానీ ఉన్నచోటు నించి కదలదు. (రహదారి (మనసు))
అరిచి గోల పెట్టె రాళ్లు? ( కీచు రాళ్లు)
యంత్రం కానీ యంత్రం. (సాయంత్రం)
అవి తెల్లని మల్లె మొగ్గలు, పరిమళాలు వెదచల్లవు కానీ, పరి శుభ్రంగా ఉంచుతాయి. (ఇయర్ బడ్స్)
క్రమమైన పయనం, నల్లపూసల సైన్యం. (నల్ల చీమల దండు)
నాకున్నది ఒకే కన్ను, చూడలేను కానీ ముక్కు చాలు ముందుకు దూసుకు పోను!(సూది)
కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది. (కుర్చీ)
ఎర్రని కోటలో తెల్లని భటులు. (పళ్ళు (teeth))
ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు. (పేలాలు (popcorn))
ఎందరెక్కినా విరగని మంచం. (అరుగు)
 ఇంటికి, ఆ ఇంటికి మధ్య ఒకటే దూలం. (ముక్కు)
మనిషికి రెండే కాళ్ళు, ఏడు చేతులు. (నిచ్చెన)
అరచేతి పట్నాన అరవై రంధ్రాలు. ( జల్లెడ)
అంగుళం గదిలో, అరవై మంది నివాసం. (అగ్గిపెట్టె)
అంగుళం ఆకు, అడుగున్నర కాయ. (ములక్కాయ)
అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే. (నక్షత్రాలు)
అడుగులున్నా కాళ్ళు లేనిది. ( గజం బద్ద (స్కేల్))
 కోస్తే తెగదు.  కొడితే పగలదు? (నీడ)
దూడ అక్కడే ఉంటుంది గానీ ఆవు మాత్రం అలా పోతూనే ఉంటుంది? (గుమ్మడి తీగ)
తలపుల సందున మెరుపు గిన్నె. (దీపం)
నల్లకుక్కకు నాలుగు చెవులు. ఏమిటది? (లవంగం)
తల్లి దయ్యం.... పిల్ల పగడం. ఏమిటది? (రేగు పండు)
ఇటునుంచి చూస్తే గుండు, ఆడికి పోయి చూస్తే పండు. పండుకు పన్నెండు ఒప్పులు. ఒప్పుకు ముప్పయి గింజలు. ఏమిటవి?(సంవత్సరం)
ఈనదు, పొర్లదు. బంధం వేస్తే పది బిందెల పాలి స్తుంది. ఏమిటది?(తాటిచెట్టు)
ఈకలు లేని కోడి ఇల్లు ఎక్కింది. ఏమిటది?(అనపకాయ)
ఇంటికి కాపలా కాస్తుంది, కానీ కుక్క కాదు. ఏమిటది? (తాళం)
శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ... ఏంటదీ? (మామిడి కాయ)
సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు.(త్రాసు)
కుడితి తాగదు, మేత మేయదు.కానీ కుండెడు పాలు ఇస్తుంది. ఏమిటది? (తాటి చెట్టు)
 కొన్నప్పుడు నల్లగా ఉంటాను వాడితే ఎర్రగా మారుతాను. చివరికి తెల్లగా అవుతాను. నేనెవరిని? (బొగ్గు)
నీటిలో పుడుతుంది.నీటిలో పెరుగుతుంది. బయటికి వచ్చి బతుకుతుంది. మళ్లీ నీటిలో మునిగితే చస్తుంది? ఏమిటది? (ఉప్పు)
కాళ్లు నాలుగు, పక్కటెముకలు నాలుగు. పేగులు గంపెడు. ఏమిటో చెప్పండి? (నులక మంచం)
సూది వెళ్లి చుక్కల్ని తాకింది (తారాజువ్వ)
ప్రాణమున్నా ఉన్నచోట నుంచి కదలలేదు (గుడ్డు)
పట్టుకుంటే ఆరిపోతుంది.... వదిలేస్తే వెలుగుతుంది. (మిణుగురు పురుగు)
నాపై పట్నాలుంటాయి, ప్రజలుండరు.  
నదులు ఉంటాయి, ప్రవహించవు. 
సముద్రాలు ఉంటాయి, ప్రవహించవు. 
తిప్పితే గుండ్రంగా తిరుగుతాను. (భూగోళం)
తోకలేని పిట్ట, తొంభై ఆమడ తిరిగింది (ఉత్తరం)
తండ్రి గర గర, తల్లి పీచు పీచు 
బిడ్డలు రత్నమాణిక్యాలు (పనస పండు)
జీవం ఉంది, కదల్లేదు (గుడ్డు)
బంగారం అంటే మూసుకుంటుంది 
మట్టి అంటే తెరుచుకుంటుంది (నోరు)
చెక్కని స్తంభం, చెయ్యని కుండ 
పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం (కొబ్బరి చెట్టు, కొబ్బరి కాయ, కొబ్బరి నీళ్లు)
కొక్కిరిస్తే కొక్కిరింత, ముద్దుకో ముద్దు, గుద్దుకో గుద్దు (అద్దం)
చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు (కన్ను, నాలుక)
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం (తేనెతుట్టె)
చింపిరి చింపిరి గుడ్డలు, ముత్యాల వంటి బిడ్డలు (మొక్కజొన్న కంకి)
పైడి పెట్టెలో ముత్యపు గింజ. (వరి గింజ)
సన్నని స్తంభం ..... ఎవరూ ఎక్కలేరు, దిగలేరు? (సూది)
నూరు పళ్లు ..... ఒకటే పెదవి?  (దానిమ్మ పండు)
మూడు రొట్టెలను ఆరుగురు చించకుండా పంచుకుని తింటారు. వారు ఎవరో చెప్పగలరా? (ఆరు పెదవులు)
తోలు నలుపు, తింటే పులుపు? (చింతపండు)
అందరినీ పైకి తీసుకెళ్తుంది, తాను మాత్రం పైకి వెళ్లదు? (నిచ్చెన)
సముద్రంలో పుట్టి పెరిగి, ఊళ్లో అరిచేది ఏమిటి? (శంఖం)
రెండు కొడతాయి. ఒకటి పెడుతుంది. ఏమిటవి? (ఎండా, వాన, చలి)
ఇల్లంతా వెలుగు.... బల్లకింద చీకటి? (దీపం)
తెలిసేలా పూస్తుంది.... తెలియకుండా కాస్తుంది? (వేరుశెనగ కాయ)
చిన్న పిల్లలకు చాలా చీరలు? (ఉల్లిపాయలు)
వేలాడే అడుగు పొడుగు పట్నంలో, అరవై ఆరు గదులు.
గదికో సిపాయి, సిపాయికో తుపాకి. ఏమిటది? (తేనెపట్టు)
తీగలపైన గానీ, తొర్రల పైన గానీ
వేళ్లు నాట్యం ఆడుతుంటే వీనుల విందు అవుతుంది. ఏమిటది? (వీణ, వేణువు)
కడవంతటి వళ్ళు, వంటి నిండా ముళ్లు
కడుపంతా మధురమైన గుళ్లు. ఏమిటది? (పనస పండు)
రెండిళ్లకు ఒకటే దూలం.
బ్రతకటానికి ఇదే మూలం. ఏమిటది? (ముక్కు)
అందర్నీ గమ్యం చేరుస్తుంది,
తాను మాత్రం ఉన్నచోటనే ఉంటుంది. ఏమిటది? (రోడ్డు, దారి)
నేనందర్నీ చూస్తాను,
నన్ను నేను చూడలేను. ఏమిటది? (కన్ను)
చక్కని చెరువు, చిక్కని నీళ్లు
తెల్లని కాడ, ఎర్రని పువ్వు. ఏమిటది? (దీపం)
రెండు చేతులు, రొమ్ముపైన కళ్లు
తలా నోరు లేకున్నా నిత్యం మనిషిని మింగుతూనే ఉంటుంది. ఏమిటది? (చొక్కా)
ఆకాశంలో తేలుతుంది, మేఘం కాదు.
తోకాడిస్తుంది, పిట్ట కాదు.
పట్టుతప్పితే ఎటో పారిపోతుంది. ఏమిటది? (గాలిపటం)
బ్రతికించేదొక హారం చంపేదింకొక హారం. ఏమిటది? (ఆహారం, సంహారం)
నీటిలో పుట్టింది, చిప్పలో పెరిగింది.
కోటలోకి వచ్చింది, నెత్తిపైకి ఎక్కింది. ఏమిటది? (ముత్యం)
ఉదయం తరుగుతూ పోతుంది,
సాయంత్రం పెరుగుతూ పోయి,
హఠాత్తుగా మాయమవుతుంది. ఏమిటది? (నీడ)
పువ్వుల్లో పుడుతుంది,
వెయ్యిమంది కాపలాలో అరల్లో దాగి వేలాడుతుంది. ఏమిటది? (తేనె - తేనెపట్టు)
తాతకు దూరమైనా, మామకు దగ్గరయ్యేది ఎవరు? (పెదవులు)
తెల్లటి నేలపైన నల్లటి విత్తనాలు,
చేత్తో చల్లటం, నోటితో ఏరటం. ఏమిటవి? (తెల్ల కాగితం మీద రాయటం, చదవటం)
ఉదయం నాలుగు కాళ్ళతో
మధ్యాహ్నం రెండు కాళ్లతోను,
సాయంత్రం మూడు కాళ్లతోను నడిచే ప్రాణి ఏది? (మనిషి)
చిన్నతనంలో అందరూ మెచ్చేదే,
పెద్దై కొండెక్కినాక పనికిరానిదవుతుంది. ఏమిటది? ఇంత వత్తి చెప్తున్నా ఇంకా తెలియలేదా?
(దీపం వత్తి)
నిలవ ఉన్న నీరైనా అదే,
చేతికి వేసుకునే దైనా అదే. ఏమిటది? (మురుగు)
చరచరా పాకుతుంది, పాము కాదు.
బిరబిరా ఎక్కుతుంది, దిగుతుంది పిల్లి కాదు.
కీచుకీచు మంటుంది పిట్ట కాదు. ఏమిటది? (బావి గిలక పై చేంతాడు)
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది? (శంఖం)
రెక్కలున్నాయి కానీ పక్షి కాదు. వేలాడుతుంది కానీ గబ్బిలం కాదు. దాని పేరేంటి? (ఫ్యాన్)
యంత్రం కాని యంత్రం. ప్రతిరోజూ చూస్తాం. ఏమిటది? (సాయంత్రం)
రాత్రీ పగలు, ఎండా వానా లెక్కే లేదు. ఎప్పుడు దూకమంటే అప్పుడే బావిలో దూకుతుంది?ఏమిటది? (చేద)
ఎంత తీసుకున్నా అంత మొందనిది. ఎంత ఇచ్చినా అంతులేనిది? ఏమిటది? (విద్య)
చింపిరి గుడ్డల పొత్తిళ్లలో ముత్యాల వరుస బిడ్డలు. ఏమిటవి? (మొక్కజొన్న కంకి)
గణ గణ మంటూ దూసుకు వచ్చేస్తుంది
మబ్బులా కురుస్తుంది, పోరాడి తిరిగిపోతుంది. ఏమిటది? (ఫైర్ ఇంజన్)
భూమిని లాగిపట్టేది
భూమి లాగిపట్టేది.
విశ్వమంత వ్యాపించిందీ, కంటికి కనిపించనిదీ శక్తి. ఏమిటది? (గురుత్వాకర్షణ శక్తి)
ఎంతో నమ్మిన బంటు, వాసనతో వేటాడే బంటు
కనిపిస్తేనే సంతోషంతో ఊగి ఊగి పోతుంది. ఏమిటది? (కుక్క)
నల్ల నీళ్లు తాగుతుంది, ముక్కుతో దేకుతుంది.
చేతిలో ఇముడుతుంది, ముసుగు పెట్టి పడుకుంటుంది. ఏమిటది? (పెన్ను)
మట్టి మనిషి, చక్రం తిప్పే మనిషి
అందరికీ కావలసిన మనిషి. ఏమిటది? (కుమ్మరి)
తోకనిండా అందమైన కళ్లు
నాట్యం చేసేటప్పుడు తెరచి తెరచి చూస్తాయి. ఏమిటది? (నెమలి)
తెల్లని సువాసనల మొగ్గ
ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏమిటది? (కర్పూరం)
వళ్లంతా కళ్లు, లోన నల్ల రాళ్లు,
రాళ్ల చుట్టూ మాధుర్యం, విసుగైనా విడిచిపెట్టరెవరు. ఏమిటది? (సీతాఫలం)
వ్యాపారికి ముద్దు, న్యాయానికి గుర్తు
తలతీస్తే పాలిస్తానంటుంది. ఏమిటది? (తరాజు)
ఒక మహిళ, కట్టుకునే చీర,
ఆపై ఒక పక్షి, మూడూ కలిసిన ఆ కీటకమేది? (సీతాకోక చిలుక)
సగంపాలు చీకటిలో, సగంపాలు వెలుతురులో
నిరంతరంగా చుట్టి తిరిగే మట్టిముద్దల పరంపర. ఏమిటది? (గ్రహాలు)
తాను కరిగిపోతున్నా,
మంచి పంచి పెడుతూ అంతరించి పోతుంది. ఏమిటది? (కొవ్వొత్తి)
పచ్చని దుప్పటి కప్పుకొని
తియ్యని పండ్లు తింటుంది. ఏమిటది? (చిలుక)
నన్నెవరూ లెక్కచెయ్యరొకసారి
పక్కన చేర్చుకొని పదింతలంటూ సన్మానిస్తారొకసారి. ఏమిటది? (సున్న)
నీరులేని సముద్రాలు
భద్రంగా దాటించే ఓడ (ఒంటె)
ఇంటికి కావలి ఉంటుంది,
వేస్తే మూసేస్తుంది,
తీస్తే తెరిచేస్తుంది,
చెవితో సంబంధం సంగీతం బాపతు కాదు (తాళం)
రెక్కలున్నా ఎగిరేందుకు కావు
ఎంత తిరిగినా ఉన్నచోటునే ఉంటుంది (ఫ్యాన్)
కాళ్లు పట్టుకుంటుంది
వెంట వెంట వస్తుంది మనకోసం, తన కోసం కాదు(చెప్పు)
ఎక్కితొక్కితే నడిచే కాళ్లు
వడివడిగా గుండ్రంగా నడిచే కాళ్లు
నీ చేతుల్లో ఉంటుంది, నీ మాటే వింటుంది (సైకిలు)
ఇంటింటికి ప్రవహిస్తూ వస్తుంది,
పనులెన్నో చేస్తుంది,
ప్రమోదకారి, ప్రమాదకారి (విద్యుత్)
నారూ నీరూ అక్కరలేదు
ఎంత కత్తిరిస్తున్నా ఎదుగుతూనే ఉంటుంది. (జుట్టు)
వెలుతురులో నీ తోటే ఉంటుంది
చీకటిలో తప్పించుకు పోతుంది (నీడ)
పన్నెండాకుల చక్రం పదేపదే తిరుగుతుంది.
తిరిగి తిరిగి ఆ రోజున అక్కడికే తిరిగొస్తుంది. (సంవత్సరాది)
కావాలంటే పెద్ద చేసి చూపిస్తా
సూర్యుని చిన్నగ చేస్తా
మంటలు మండిస్తా         (భూతద్దం)
అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. ఏమిటది? జవాబు : పుట్ట 
అది లేకపోతే ఎవరూ ఏమి తినరు. ఏమిటది? జవాబు : ఆకలి 
అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది. ఏమిటది? జవాబు : ఈతచెట్టు 
అడవిలో ఆంబోతు రంకె వేస్తుంది. ఏమిటది? జవాబు : గొడ్డలి 
అరచేతి కింద అరిసె ? ఏమిటది? జవాబు : పిడక 
పుట్టినా కదలంది, కొడితే మాత్రం చస్తుంది.
ఏమిటది? జవాబు : గుడ్డు 
నీళ్లలో నివసించు
కళ్లు తెరిచే నిద్రించు
మొప్పల ద్వారా శ్వాసించు
ఏమిటది? జవాబు : చేప 
మూడు కాళ్ల ముసలిదంట,
వీపు మీద నోరంట,
కవలమెత్తి చేతికిస్తే కమ్మగా దిగమింగునంట.
ఏమిటది? జవాబు : గానుగ 
నామముండు కాని పూజారి కాదు,
వాలముండు కానీ కోతి కాదు
ఏమిటది? జవాబు : ఉడుత 
జామ చెట్టు మీద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా? జవాబు : నీడ 
యేరు మీద మిరప చెట్టు నాకగపడుతుంది, నీ కగపడదు? జవాబు : బొట్టు 
నల్లటి కుక్కకు 4 చెవులు - జవాబు : లవంగం 
పచ్చనింట్లో పదిరాళ్లు, రాళ్లపై అరవైరవలు, రవలన్నీ నలిగిపోతే గుక్కెడు నీళ్ల గుటుక్కు
జవాబు : నిమ్మకాయ 
కాటుక రంగు, కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన కుంగు.
ఏమిటది?(జవాబు :  గొడుగు)
రెక్కలు లేవు కానీ ఎగురుతుంది.
కాళ్లు లేవు కానీ ముందుకు వెళ్తుంది.
చివరకు మాయమవుతుంది.
ఏమిటది?(జవాబు : మేఘం)
కదలకుండానే నదిని దాటగలదు?
ఏమిటది?(జవాబు : వంతెన)
ముందుకూ వెనక్కూ తప్ప పక్కలకు కదలదు.
ఏమిటది?(జవాబు : తలుపు)
గుడ్డ కింద దాగున్న దొంగకు నాలుగు కాళ్లు.
ఎవరది?(జవాబు : టేబుల్)
చెట్టంతా చేదుమయం,
రోగాలకు దివ్య ఔషదం,
పుల్ల చేయు దంతదావనం.
ఏమిటది?(జవాబు : వేపచెట్టు)
నల్ల కుక్కకు నాలుగు చెవులు?
ఏమిటది?(జవాబు : లవంగం)
పొట్టలో వేలు, నెత్తి మీద రాయి?ఏమిటది?(జవాబు : ఉంగరం)
సన్నని స్తంభం,
ఎక్కలేరు, దిగలేరు?ఏమిటది?(జవాబు : సూది)
ఆకాశంలో కెగిరినా పక్షి కాదు,
తోక కలిగిఉన్నా మేక కాదు,
తాడు ఉన్నా ఎద్దు కాదు,
ఏమిటది?(జవాబు : గాలిపటం)
వేసే వేసే జీలకర్రా,
మొలిచే మొలిచే మూలకా కూర,
పూసే పూసే బొండు మల్లే,
వేసే వేసే వింత గెలరా,
కాసే కాసే కామంచీ. ఏమిటది?(జవాబు : అరటి)
నల్లని చేనులో తెల్లటి దారి?
ఏమిటది?(జవాబు : తల్లో పాపిడి)
దూడ అక్కడనే ఉండు,
ఆవు పోతావుండు?
ఏమిటది?(జవాబు : గుమ్మడికాయ తీగ )
జవ్వాది రాయంగా,
పునుగు పూయింగా,
మందగిరి పర్వతాలలో నీరు తాగి,
మశాలకు వేసుకొని పడుకుంది. ఏమిటది?((జవాబు : దివిటి)
రెక్కలు గల మా చక్కని భామలు,
నిక్కముగా అసలెగురలేదు,
నీరంటే అడ్డమే లేదు.  ఏమిటది?(జవాబు : పడవ)
అగ్గి అగ్గీ ఛాయ,
అమ్మ కుంకుమ ఛాయ,
బొగ్గు బొగ్గు ఛాయ,
పోలి ఛాయ కంది పప్పు ఛాయ,
కాలనేమి ఛాయ,
కడసారి తాతయ్య కణతి ఛాయ. ఏమిటది?(జవాబు : గురిగింజ)
అమ్మ కడుపున పడ్డాను,
అంతా సుఖాన ఉన్నాను,
నీచే దెబ్బలు తిన్నాను,
నిలువునా ఎండి పోయాను,
నిప్పుల గుండు తొక్కాను,
గుప్పెడు బూడిద అయినాను. ఏమిటది?(జవాబు : పిడక)
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది,
మాఇంటికొచ్చింది,
మహాలక్ష్మి లాగుంది. ఏమిటది? (జవాబు : గడప)
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది,
మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? (జవాబు : చల్ల కవ్వం)
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు,
కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు,
అన్ని పువ్వుల్లో రెండే కాయలు. ఏమిటవి?(జవాబు : ఆకాశం, చుక్కలు, సూర్యుడు
బుర్రు బుర్రు మనచును ....
రోడ్డు పైన నడచును.......  ఏమిటది? (జవాబు : స్కూటర్)
కుర్రు కుర్రు మనచును .........
చెట్టుపైకి ఎగురును .......... ఏమిటది? ( జవాబు : కోతి)
తుర్రు తుర్రు మనచును ......
అంబరానికెగురును....... ఏమిటది? (జవాబు : పక్షి)
అంబ అంబా అని అరుచును
తల్లి వెంట తిరుగును .....ఏమిటది ?(జవాబు : తువ్వాయి (ఆవుదూడ))
మీట నొక్కినంతనే .........
టక్కుమని వెలుగును ...... ఏమిటది? (జవాబు : బల్బు)
చుట్ల చుట్ల గోడ మీద నూరు నిమ్మపండ్లు పుట్టె,
రాజులంత తలవంచిరి. ఏమిటది? (జవాబు : మొక్కజొన్నకంకి)
 ఒక చెట్టు,
 చెట్టుకు నాలుగు కొమ్మలు,
కొమ్మకు రెండు కాయలు. ఏమిటవి? ( జవాబు : సూర్యుడు, చంద్రుడు)
కావాలంటే పెద్ద చేసి చూపిస్తా
సూర్యున్ని చిన్నగా చేస్తా
మంటలు మండిస్తా. ఏమిటది? (జవాబు : భూతద్దం)
పన్నెండాకుల చక్రం పదే పదే తిరుగుతుంది.
తిరిగి తిరిగి ఆ రోజున అక్కడికే తిరుగొస్తుంది. ఏమిటది?(జవాబు : సంవత్సరాది)
వెలుతురులో నీతోటే ఉంటుంది.
చీకటిలో తప్పించుకు పోతుంది. ఏమిటది? (జవాబు : నీడ)
నారూ  నీరూ అక్కరలేదు
ఎంత కత్తిరిస్తున్నా ఎదుగుతునే ఉంటుంది.  (జవాబు : జుట్టు)
ఇంటింటికి ప్రవహిస్తూ వస్తుంది,
పనులెన్నో చేస్తుంది,
ప్రమోదకారి, ప్రమాదకారి. ఎవరది? (జవాబు : విద్యుత్)


చదువున్నా లేకున్నా తల్లిలా వెంటనంటి ఉంటుంది.
కనపడని మనస్సును వినపడేట్లు చేస్తుంది. (మాతృభాష తెలుగు)
గులాబిలో ఉన్నా, మాలతిలోనూ ఉన్నా
జాజి పువ్వులోలేను, ఎవర్ని నేను?("ల" అక్షరం)
పుట్టెడు సంగతుల్ని పోగుచేసి తెస్తుంది.
ఒక్కనాటి వైభోగం మర్నాటికి మాస్తుంది. (వార్తాపత్రిక)
ఏడాదికి ఒక్కసారి నీకోసం వస్తాను.
ఆప్యాయముగా పలకరించిపోతాను.(పుట్టినరోజు పండుగ)
అల్పుణ్ని పైకెత్తుతుంది
అధికుడైతే అధోగతే!(తరాజు)
ఆకుపచ్చ కాయ వగరు, పండితే తీపి ?(అరటి)
ఆ కొండకీ, ఈ కొండకీ ఇనుప సంకెళ్ళు? (విస్తరాకు)
ఆకు చిటికెడు కాయ మూరెడు ?(మునగ కాయ )
జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ ?(నీడ)
ఆకాశాన అరవై గదులు గదికొక్క సిపాయి, సిపాయి కొక్క తుపాకీ ?(తేనెపట్టు)
అనగనగా ఒక గచ్చు మేడ, గచ్చు మేడ పై చెక్క మేడ, చెక్క మేడ ముందు కంచు మేడ, కంచు మేడలో ముత్యాలమేడ, ముత్యాలమేడలో అయిదుగురు నాట్యం?(నేల, పీట, పళ్లెం, అన్నం, వేళ్లు)
అది లేనిదే నేను తినను.ఏమిటది ?(ఆకలి)
చూస్తే చూపులు,నవ్వితే నవ్వులు,గుద్దితే గుద్దులు ?(అద్దం)
అమారా దేశం నుండి కొమారా పక్షి వచ్చింది.ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్ళు తాగుతుంది.(ప్రమిద)
ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన(రామచిలుక)
మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి)
కోస్తే తెగదు,కొడితే పగలదు (నీడ
చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగ నుండు (కొబ్బరి కాయ)
కోడి కాని కోడి (( పకోడీ ))
కారం కాని కారం ((ఉపకారం ))
దానం కాని దానం( (నిదానం ))
అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది, మాఇంటి కొచ్చింది, తైతక్క లాడింది.(చల్లకవ్వం)
వేలెడంత ఉండదు. కానీ మనం బయటకు వెళ్ళాలన్నా. ఇంట్లోకి రావాలన్నా అది ఉండాల్సిందే. ఎవరది?(తాళం చెవి)
రెక్కలున్న ఎగరలేదు. ఎంత తిరిగినా ఉన్న చోటు నుంచి కదలలేదు. ఏమిటది?(ఫ్యాన్ )
చూస్తే చూసింది గానీ కళ్లులేవు
నవ్వితే నవ్విందిగాని నోరు లేదు
తంతే తన్నబోయింది కానీ కాళ్లు లేవు (అద్దం)
చూసింది ఇద్దరు
కోసింది ఐదుగురు
తినింది ముప్పైఇద్దరు (పళ్లు)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు