Pages

కవులు - Prasiddha Kavulu

కవులు - ప్రసిద్ధ కవులు 
బమ్మెర పోతన 
15 వ శతాబ్దానికి చెందినవారు.
తల్లితండ్రులు: లక్కమాంబ, కేశవ 
ఇతను సహజ కవి, సహజ పండితుడిగా పేరు పొందారు. 
రచనలు :
వీరభద్ర విజయం, భోగినీ దండకం, భాగవతం, నారాయణ శతకం 

  • పోతన తొలి రచన వీరభద్ర విజయం. అయితే గొప్ప రచనగా భాగవతం పేరు తెచ్చింది. 
  • వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల వరుసలో 5వదిగా పేరు గాంచిన భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించారు. భాగవతంలోని భాగాలను స్కంధాలు అంటారు. భాగవతంలో మొత్తం 12 స్కంధాలు ఉన్నాయి. 
  • పోతన రాసిన భాగవత స్కంధాల్లో కొన్ని నష్టమవడంతో పంచమ స్కంధాన్ని గంగన, షష్ఠి స్కంధాన్ని సింగన, ఏకాదశ ద్వాదశ స్కంధాలను వెలగందల నారయ తిరిగి రాశారు. 
  • పోతన రచించిన దశమ స్కంధంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలను వర్ణించారు.  

మారన 
  • 13 వ శతాబ్దానికి చెందినవారు. 
  • మారన, తిక్కనకు శిష్యుడు. 
  • ఇతడి గొప్ప రచన 'మార్కండేయ పురాణం' అష్టాదశ పురాణాల్లో తెలుగులోకి అనువదించిన తొలి పురాణంగా గుర్తింపు పొందింది. 
  • మారన 
    మార్కండేయ పురాణంను కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని నాగయ గన్నడికి అంకిత మిచ్చారు. 
  • 8 అశ్వాసాలతో కూడిన ఈ చంపూ కావ్యంలో సుమారు 2547 పద్య గద్యాలు ఉన్నాయి. 
పాల్కురికి సోమనాథుడు
12 వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు దేశికవితోద్యమకారుడిగా, ప్రథమాంధ్ర విప్లవ కవిగా ప్రసిద్ధి పొందారు. ఇతన్ని తెలంగాణ ఆదికవిగా పరిగణిస్తారు. సంస్కృతాంధ్ర కన్నడ భాషల్లో పండితుడైన  పాల్కురికి సోమనాథుడు సుమారు 30 రచనలు చేశారు. 
                                                           సోమనాథుని రచనలు 
పద్య కృతులు:
అనుభవ సారం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసాలు, వృషాధిప శతకం
ద్విపద రచనలు :
బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర 
సంస్కృత రచనలు :
సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, త్రివిధ లింగాష్టకం, బసవోదహరణం 
కన్నడ రచనలు :
బసవ రగడ, చిన్న బసవ రగడ, శరణు బసవ రగడ
ఇతర విశేషాలు :
పాల్కురికి సోమనాథుడు ఓరుగల్లు సమీపాన పాలకుర్తి అనే గ్రామంలో జన్మించారు. 
తల్లితండ్రులు: శ్రియాదేవి, విష్ణురామి దేవుడు 
  • ఇతడు రచించిన వృషాధిప శతకం పూర్తిగా శతక లక్షణాలతో వచ్చిన తొలి తెలుగు శతకం . సంస్కృత, తెలుగు పదాల కలయికతో కూడిన "మణి ప్రవాళ్ శైలిని" ఈ రచనలో ఉపయోగించారు. 
  • సోమన రచనల్లో "బసవ పురాణాన్ని" గొప్పదిగా చెపుతారు. ఇందులో దేశి కవిత అయిన ద్విపదకు పట్టాభిషేకం చేసిన కవిగా ప్రసిద్ధి పొందారు. ద్విపద అంటే రెండు పాదాలతో  ఉందని అర్థం. పాడుకోవడానికి వీలుగా ప్రాస నియమంతో ఉంటుంది. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు. 
  • బసవ పురాణంలో 75 మంది శైవ భక్తుల కథలు ఏడు అశ్వాసాలుగా విభజితమై ఉన్నాయి. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు