Pages

చిలిపి ప్రశ్నలు

రాయి గాని రాయి.. కొక్కిరాయి
పాలుగాని పాలు...  పాపాలు
కారు గాని కారు... పుకారు
కర్ర గాని కర్ర..జీలకర్ర
కట్టుగాని గట్టు...కనికట్టు 
తాగరాని నీరు...కన్నీరు
పట్టలేని గొడుగు... పుట్టగొడుగు
పాపగాని పాప... కనుపాప
మేడగాని మేడ ...గాలిమేడ
ప్రతి ఒక్కరూ 'టైటానిక్ పోజ్' ఇచ్చేది ఎప్పుడు?(సెక్యూరిటీ చెకప్ కోసం!)
మనషులు ఉండలేని ఇల్లు?(బొమ్మరిల్లు)
ఆఫ్రికా వాళ్ళు కూర్చోమన్నా కూర్చోరు ఎందుకు?(వాళ్లకు తెలుగు రాదు కాబట్టి)
భవనాల కన్నా ఎత్తు ఎగిరే మనిషి ఎవరు?(అందరూ! అసలు భవనాలు ఎగరలేవుగా)
రాకెట్లో కుక్కను అంతరిక్షంలోకి ఎందుకు పంపారు?(రాకెట్ ను ఎవరైనా దొంగాలిస్తారేమో అని)
భారత్, పాకిస్తాన్ ల మధ్య ఏముంది?(కామా  ఉంది)
బావిలోకి దిగినా తడిసి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి?(నీళ్ళు లేని బావిలోకి దిగాలి)
ఆలోచన లేకుండా చేసే పని ఏమిటి?(ఊపిరి పీల్చటం)
వేసుకోలేని హారం?(ఆహారం)
నిండు నూరేళ్ళు ఎవరు బతుకుతారు?(ఆయుష్షు ఉన్నవాళ్ళు)
ఉరుములు, మెరుపులు లేకుండా కురిసేది ఏది?(వెన్నెల)
ఆలోచన లేకుండా చేసే పని ఏమిటి ?(ఊపిరి పీల్చుకోవటం)
కృష్ణుడు వెన్నను ఎందుకు దొంగాలించేవాడు?(తినడానికి)
దేవుడు ఎప్పుడు వరమిస్తాడు?(ప్రత్యక్షమైనప్పుడు)
ఆగకుండా 60 నిముషములు పరుగెడితే ఏమవుతుంది? (గంటవుతుంది)
తినగలిగే నగ ?--------------> శనగ
మనషులకు ఉండని కాలు ?----------------> పథకాలు 
రాజ్యం లేని రాణి ?------------------------>పారాణి
ఉత్తరానికీ, దక్షిణానికి తేడా ?--------------------->ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లో వేయవచ్చు , దక్షిణాన్ని వేయలేం!
కుక్క , పిల్లి ఏమని తిట్టుకుంటాయి ?----------------->భౌ భౌ , మ్యావ్ మ్యావ్ 
బస్సును బస్టాండ్ లో ఎందుకు నిలబెడతారు?--------->కూర్చోబెట్టలేరు కాబట్టి
ఏనుగులకు ఉండని దంతం?----------------------->ఉదంతం 
తాళం చెవి తాళం కప్పతో ఏమంటుంది?------------------------->కడుపులో పొడిస్తేగాని నోరు విప్పవుకదా !
రాజకీయ నాయకులు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు నీళ్ళు ఎందుకు తాగుతారు ? ->వాగ్దానాలు గొంతు దిగక 
భూమ్మీద జిరాఫీ కన్నా ఎత్తు అయినది ఏది?---------------------->దాని నీడ 
సెల్ ఫోన్, ఛార్జర్ పాడుకొనే యుగళగీతం ఏమిటి?------------------->నేను లేక నీవు లేవు...నీవు లేక నేను లేను!
తినలేని వడలు -------------------------------------------------->దవడలు 
అట్లకాడతో కూరముక్కలు ఏమంటాయి?---------------------------->నీతో వేగలేక చస్తున్నాం 
రైళ్ళు ఆగని స్టేషన్? ------------------------------------------------->పోలిస్ స్టేషన్ 
గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు?--------------------->నుదిటికి 
రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు ఎలా?--------------->రసం తీసి 
ఈ ప్రపంచములోనే ఉండదు, అయినా మనం వాడతాం. ఏమిటది?----->గాడిద గుడ్డు 
డ్రైవర్ లేని బస్ ---------------------------------------------------->సిలబన్ 
చలి కాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది?-------------------------->కప్పు ఖాళీ అవుతుంది.
ఒకే గొడుగు కింద నలుగురు వెళ్ళినా, తడవలేదు. ఎందుకు? ----------> వర్షం పడటం లేదు కాబట్టి 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు