Pages

Manchi Maata - మంచి మాట - సూక్తులు

గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో, వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. 
నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. 
నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం. 
అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. 
మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు. అంతేకానీ జన్మతః కాదు. 
మనిషి వ్యక్తిత్వాన్ని అతని వృత్తితో కాకుండా, ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి. 
పొరపాటు చేయని ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్తగా ఆలోచించలేడు. 
శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధించగలరు. 
మనది కాని వస్తువు పై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం. 
ప్రపంచాన్ని మార్చాలంటే శక్తిమంతమైన ఆయుధం చదువొక్కటే!
వేలాది వ్యర్థమైన మాటలు వినటం కన్నా, శాంతిని, కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు!
ఎంత సేపు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత శ్రద్దగా చదివామన్నదే ముఖ్యం. 
ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు. ముందు నువ్వు మారడం ముఖ్యం. 
ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. 
నిన్న నుంచి నేర్చుకో, నేటి కోసం జీవించు, రేపటి గురించి ఆశించు. 
జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. 
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో.  భూమిని చూసి ఓర్పును నేర్చుకో. 
ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీలేని పేదల గురించి ఆలోచించు. 
మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును. 
మంచి పనులకు పునాది క్రమశిక్షణ. అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది. 
పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. 
ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే, ఆధారమైన దారం గురువు. 
ఇది ఛాలా క్లిష్టమైన సమస్య అనే సాకు వద్దు. క్లిష్టమైనది కాకపోతే అది సమస్య ఎందుకవుతుంది. 
విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతిచోటా గౌరవింపబడతాడు. 
నిరంతర సాధన ఫలితమే నైపుణ్యం. అది అకస్మాత్తుగా వచ్చేది కాదు. 
అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, చివరకు భగవంతుని నుంచి దూరం చేస్తుంది. 
పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. కానీ మంచితనం ప్రతి దిక్కుకూ ప్రసరిస్తుంది. 
వెలిగే దీపం ఇతర దీపాలను వెలిగించినట్లు, నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. 
కోపం రావడం సహజం. కాకపోతే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలిసి ఉండటమే విజ్ఞత. 
దేనినైనా ప్రేమతో చేసి చూడండి. అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది. 
మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి. 
విద్య నీడ లాంటిది. దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. 
మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి. 
వందమందికి నీవు సహాయ పడలేక పోవచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు. 
నిన్నటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించే వ్యక్తికి విజయాలు దక్కుతాయి . 
సంస్కారం  లేని చదువు వాసన లేని పూవు లాంటిది 
క్రమశిక్షణ, ఐకమత్యం దేశానికి నిజమైన బలం 
అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. 
గమ్యాన్ని చేరుకోవడం కన్నా గమ్యం వైపు అడుగులు వేయడం ముఖ్యం. 
ప్రతి క్షణాన్నీ ఒక మధుర జ్ఞాపకంగా చూపించగలిగేది ఒక్క ఫోటో మాత్రమే. 
సాధించాలనే తీవ్రమైన తపన మనలోని బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. 
మనుషులను చంపగలరేమో గానీ, వారి ఆదర్శాలను మాత్రం కాదు. 
విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతిచోటా గౌరవాన్ని పొందుతాడు. 
ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటిని నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. 
అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. 
ఇతరులను జయించటం కంటే తన మనసును తాను జయించటం కష్టం . 
సన్మానం పొందడంలో గొప్పదనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పదనము ఉంది. 
ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. 
మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే 
వేచి ఉంటే అవకాశాలు వస్తాయి. కానీ అవి దూసుకుపోయే వాళ్లు వదిలేసినవి మాత్రమే. 
ఆత్మ విశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే, అదే ఆత్మ విశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. .. 
ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి......... దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి ......... దాన్నే ధ్యానించండి.........  దాన్నే కలగనండి. దాన్నే శ్వాసించండి. ఇదే విజయానికి మార్గం. 
జీవితంలో భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండే వారు గొప్ప విజయాలు సాధించగలరు. 
వేలాది వ్యర్థమైన మాటలు వినే కన్నా......... శాంతిని, కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు. 
మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. 
నువ్వు ఇతరులలోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరినీ ప్రేమించలేవు. 
లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. 
విజయానికి తొలిమెట్టు మనపై మనకు ఉన్న విశ్వాసం. 
మనస్ఫూర్తిగా పని చేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. 
ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు ఓ కొత్త స్నేహితుడు దొరికినంత సంబరం. ఆ పుస్తకాన్ని మళ్లీ చదివితే చిరకాల మిత్రుని కలిసినంత ఆనందం. 
మన శక్తికన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. 
భయపడకు, నీవు ఎన్ని సార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో, నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో......... వెలుగు వచ్చే తీరుతుంది. 
వినడానికి కటువుగా ఉన్నా మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. 
ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ....... ఎప్పటికీ శాశ్వతం కాదు. 
సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు. ఆ కాలంలో మనం ఏం చేశాం! ఏలా ఉన్నాం!ఏం సాధించామన్నది ముఖ్యం. 
ప్రయత్నం చేసి ఓడిపో ........ కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు 
సుఖం దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవాడు, దుఃఖానికి స్వాగతం చెప్పి తీరాల్సిందే. 
జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు.కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే!
అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తించుకోవాలో, ఎంత వరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. 
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో  దాని ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది. 
పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు.......!!
విద్య లక్ష్యం సంపాదన కాదు, విద్య వివేకాన్ని, విమర్శనాశక్తిని అందించాలి. 
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. 
ఇతరులను జయించడం కన్నా, తనని తాను జయించడం చాలా కష్టం 
విజ్ఞానం ఉందని గర్వించటమంత అజ్ఞానం మరొకటి లేదు. 
ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి. దాన్నే ధ్యానించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి ఇదే విజయానికి మార్గం. 
ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. 
మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా, చేతిలో ఉన్న వర్తమానంతో భవిష్యత్తు కోసం శ్రమించు!
నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. 
పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. 
నిన్ను చూసి చప్పట్లు కొట్టే పదివేళ్ల కన్నా నీ కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న. 
కష్టసుఖాలకు సంసిద్ధంగా ఉన్నవారే స్వేచ్చగా జీవించగలరు. 
దేవుడు మనకు విజయాలనందివ్వడు. విజయం సాధించడానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. 
ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో, పెత్తనం కాదు. 
అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక!!
లేని గొప్పతనం ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది. 
అత్తరు దుకాణానికి వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని గ్రహిస్తాం. ఉత్తముల సాహచర్యమూ అంతే!
మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలూ ఉన్నట్టే!
మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. 
జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరికినప్పుడు కలుగుతుంది. 
మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. 
శరీరానికి మరణం ఒక్కసారే. కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే!
ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. 
మనసు చెప్పినట్టు మనం వినడం కాదు........ మనం చెప్పినట్టు మనసు వినేలా చూసుకోవాలి. 
వినడానికి కటువుగా ఉన్నా....... మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. 
ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులకు సమానం. కానీ, ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. 
భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే......... భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. 
హృదయ సౌందర్యం లేని శరీర సౌందర్యం వ్యర్థం. 
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే........ ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనము చేస్తుంది. 
వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కానీ ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి. 
ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో, ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. 
నీ వెనక ఏముంది........ నీ ముందు ఏముంది ........ అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. 
వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కాని ధనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనది. 
మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం........ రెండూ నేరమే!
మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 
మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. 
తక్కువ సంపాదన ఉన్నవారికన్నా తక్కువ  ఉన్నవారికే ఇబ్బందులు వస్తాయి. 
నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. 
మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం ఆనందమయం  అవుతుంది. 
తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు. 
మనసులో అసూయ, ద్వేషాలు లేని వాళ్లను అందరూ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. 
ఏ పని చక్కగా చేయాలన్నా........ ముందు ఆ పనిలో ఆసక్తి ఉండాలి. 
నోట జారిన మాట, చేజారిన అవకాశం, గడిచిపోయిన కాలం తిరిగి లభించవు. 
ఏ పరిస్థితుల్లో ఉన్నా..... నీ కర్తవ్యం నీకు గుర్తుంటే ......... జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. 
పిరికి మాటలు మాట్లాడవద్దు, వినవద్దు. ఎందుకంటే....... అవి జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. 
మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనను భయపెట్టలేడు!
మన శక్తిని తెలియజేసేది .... మన సామర్థ్యం. మనము ఏం చేయగలమో తెలిపేది. ఆత్మవిశ్వాసం. మనమేంటో నిర్ణయించేది........ మన వ్యక్తిత్వం. 
మనలోని లోపాలను ఎత్తి చూపేవాడే నిజమైన మిత్రుడు. 
చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు. 
వినడానికి కటువుగా ఉన్నా ...... మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. 
మన లోపాలను మనం తెలుసుకోవడమే అన్నింటికన్నా పెద్ద చదువు. 
సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు. కానీ ఆ కాలంలో మనం ఏం చేశాం, ఎలా ఉన్నాం, ఏం సాధించామన్నదే ముఖ్యం. 
చిన్న విషయమే కదా అని దేనినీ తేలికగా తీసుకోకూడదు. అతి పెద్ద ఓడను కూడా ఓ చిన్న రంధ్రం నిలువునా ముంచేస్తుంది. 
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. 
మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయం మన వెంటే ఉంటుంది, స్వశక్తిని మించిన ఆస్తి మరేది లేదు.  
ఈర్ష్య, అసూయలు కంట్లో నలుసులాంటివి, వాటిని మనలోంచి తొలగించినపుడే నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం. 
తన తల్లిని గాఢంగా ప్రేమించే వ్యక్తి జీవితాంతం విజేత మనస్తత్వంతో ఉంటాడు. 
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు 
కుక్క తోక పట్టి గోదావరి ఈదునట్లు 
బెల్లమున్న చోటికి చీమలు చేరినట్లు 
చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్మినట్లు 
తన బలిమి కన్నా స్థాన బలిమి మిన్న 
అనువు గాని చోట అధికుల మనరాదు
కంచు మ్రోగినట్లు కనకం మ్రోగునా 
నీరు పల్లమెరుగు నిజం దేముడెరుగు 
అసత్యమాడుట పిరికి పందల గుణం 
నిజాన్ని నిర్భయముగా చెప్పవలెను 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు