Pages

బడి - బాలల గేయాలు 2

1. గణగణ గణగణ
   గణగణ మనుచును
   పిలిచెను బడిగంటా, ఆహా,
  పిలిచెను బడిగంట!

2.వడివడి వడివడి
   అడుగులు వేయుచు
   వేగమె రారండి, మీరు
    వేగమె రారండి!

3.బడిలో అడుగిడి
   అలజడి చేయక
  పలకలు పట్టండి, మీరు
  పలకలు పట్టండి!

4.పలకల మీదను
  బలపముతోను
  చకచక రాయండి, మీరు
 చకచక రాయండి!

5.గణగణ గణగణ
  గణగణ మనుచును
  మోగెను బడిగంట, తిరిగి
  మోగెను బడిగంట!

6.వడివడి వడివడి
   అడుగులు వేయుచు
   వేగమె పోపొండి, ఇండ్లకు
   వేగమె పోపొండి.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు