Pages

Telugu Kiranaalu - Sumati Satakam - కూరిమిగల దినములలో

సుమతీ  శతకం - కూరిమిగల దినములలో

కూరిమిగల దినములలో 
నేరము లెన్నడును గలుగ నేరవు ; మఱియా 
కూరిమి విరసంబైనను 
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !

అర్థాలు : కూరిమి = స్నేహం ; నేరము = తప్పు ; విరసము = విరోధము ; నిక్కము = సత్యము 

భావము : మనం ఎవరితోనైనా స్నేహంగా ఉన్నపుడు వారు తప్పుచేసినా మనం పట్టించుకోము. వారి తప్పులు కనిపించవు . కానీ వారికీ మనకు విరోధము ఏర్పడితే వారు ఏది చేసినా మనకు అన్నీ తప్పులుగానే కనిపిస్తాయని భావం. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు