Telugu Kiranaalu - చదువది యెంత కల్గిన
చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదనుగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా !
అర్థాలు : రసజ్ఞత = రసికత , సారం గ్రహించటం ; ఇంచుక = కొంచెం ; నిరర్థకం = వ్యర్థం;
గుణసంయుతులు = బుద్దిమంతులు ; ఇంపొదెవెడు = రుచి పుట్టించే , అందాన్నిచే
భావం : మనిషి యెంత చదువుకున్న రస గ్రహణ శక్తి లేకపోతే ఆ చదువు వ్యర్థం. బుద్దిమంతులు అతని చదువును మెచ్చుకోరు. ఎలాగంటే మంచికూరను చాలా రుచిగా నలపాకం లాగా వండినా, ఆ కూరలో ఉప్పు లేకపోతే రుచి కలుగదు కదా .
No comments:
Post a Comment