Pages

Sri Krishna Satakam - అందెలు గజ్జెలు మ్రోయగ

శ్రీకృష్ణ శతకము - అందెలు గజ్జెలు మ్రోయగ 

అందెలు గజ్జెలు మ్రోయగ 
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా 
నందుని సతి యా గోపిక 
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా !

భావము : ఓ కృష్ణా ! పసితనమున నీ కాళ్ళ కలంకరించిన అందెలు, గజ్జెలు చప్పుడగునట్లు 
               గంతులిడుచు వేడుకగా నందుని భార్యయగు నా యశోద ముందర ముద్దులొలుక
               నీ వాడుచుందువు.  

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు