Pages

Vemana Satakam - నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు

వేమన శతకము - నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు 
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు 
బయట కుక్క చేత భంగపడును 
స్థానబలిమి గాని తన బల్మిగాదయా 
విశ్వదాభిరామ వినురవేమ !

భావము : ఓ వేమా ! నీళ్ళలో ఉన్న మొసలి చిన్నదైనను ఏనుగును కూడా నీటిలోకి లాగి 
               చంపగలదు. కాని ఆ మొసలి తన స్థానమైన నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు 
               కుక్క చేత కూడా ఓడింపబడును. మొసలికి ఆ బలం స్థానము వలన వచ్చిన 
               బలమే కాని తన స్వంత బలము కాదు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు