Pages

Vemana Satakamu - కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు

వేమన శతకము - కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు 
కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు 
యుప్పు  లవణమండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొక్కటే 
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావము : సంస్కృతంలో కుండను కుంభమంటారు. ఉప్పును లవణం అంటారు. 
                కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు 
                పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, కృష్ణా అనండి కేవలం 
                పేర్లు మార్పే కానీ పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే,
                మతాలు వేరైనా మనుషులొక్కటే అనే సమతా భావాన్ని పెంచుకోండి. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు