Pages

Vemana Shatakamu - ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు

వేమన శతకము - ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు 
ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు 
నొరుల వశముగాదు ఓగుదెల్ప 
యేటివంక దీర్ప నెవ్వరితరమయా?
విశ్వదాభిరామ! వినురవేమ! 

భావము : తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే.            
               తాపట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం.   
               అలాంటి వాడికి తెలియజెప్పడం ఎవరి తరము కాదు. ఏటి కుండే ప్రకృతి సిద్దమైన 
               వంపును సరిచేయడం ఎవరికి సాధ్యమౌతుంది? అలాగే మూర్ఖుడిని కూడా సరి 
               చేయలేము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు