కుమార శతకము - వగువకు గడిచిన దానికి
వగువకు గడిచిన దానికి
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!
భావము : ఓ కుమారుడా! అయిపోయిన పనిని గురించి చింతింప వద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు.
నీకు సాధ్యం కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికి రాదు. భగవంతుడు
యిచ్చిన దానితో తృప్తి చెందుము.
No comments:
Post a Comment