Pages

తెలుగు పద్యాలు - Telugu poems - ఐదువేళ్ల బలిమి హస్తంబు పనిచేయు

తెలుగు పద్యాలు - Telugu poems - ఐదువేళ్ల  బలిమి హస్తంబు పనిచేయు 
ఐదువేళ్ల  బలిమి హస్తంబు పనిచేయు
నందొకండు విడ్డ పొందు చెడును
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి
విశ్వదాభిరామ వినురవేమ

భావము : అయిదువేళ్ళు కలిపితేనే పిడికిలి బలంగా ఉంటుంది, చెయ్యి బాగా
               పనిచేస్తుంది. అందులో ఏ ఒక్క వేలును వదిలివేసినా ఆ చేతికి
               బలం ఉండదు, పనిచేయడం కష్టమవుతుంది. కుటుంబములో నైనా
              బృందములో నైనా కూడా అంతే. అందరూ సయోధ్యతో ఉంటేనే పనులు
              సక్రమముగా జరుగుతాయి. ఏ ఒక్కరు వ్యతిరేకముగా ఉన్నా ఫలితం చెడుతుంది.
              అందుకే ఐకమత్యం, సమష్టితత్వం ఎంతో గొప్పవి. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు