Pages

Vemana Padyam - ఎన్నియెన్ని పూజలెన్ని చేసిన నేమి?


ఎన్నియెన్ని పూజలెన్ని చేసిన నేమి?
భక్తిలేని పూజ ఫలము లేదు,
భక్తి కలుగు పూజ బహుళ కారణమురా!
విశ్వదాభిరామ వినుర వేమ!

భావము: ఎన్నెన్నో పూజలు చేస్తారు. కాని ఏం లాభం? భక్తి లేకుండా చేసిన పూజ వలన ప్రయోజనం ఏమీ లేదు. భక్తితో చేసిన పూజ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భక్తితో తనను ఎవరు పూజిస్తారో, వారియొక్క యోగ క్షేమాలను భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు