Pages

Telugu Bhaskara shataka Padyalu - ఉరుబలశాలి నంచు

భాస్కర శతక పద్యం - ఉరుబలశాలి నంచు 

ఉరుబలశాలి నంచు దను నొల్లని యన్యపతివ్రతాంగనా 
సరతము గోరెనేని కడ సుమ్మది భూతికి బ్రాణహాని యో 
శిరములు గూల రాఘవునిచే దశకంఠుడు ద్రుంగి పోవడే 
యెరుగక సీతకాసపడి యిష్టుల భృత్యులగూడి భాస్కరా 

తాత్పర్యము: తాను బలవంతుడనియు అందకాడనియు గర్వించి పతివ్రతలగు పరవనితలను బలవంత పెట్టునేని వానియభివృద్ది యంతటితో ముగియును. ప్రాణములను గోల్పోవును. రావణాసురుడు చేటెరుగక సీతామహాదేవిని గోరి పుత్రమిత్రాదులతో గూడ నశించెనుగదా?

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు