వేమన పద్యం - చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది. నీటిలో పడిన చినుకు వ్యర్థం అవుతుంది. ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం అదే వస్తుంది.
No comments:
Post a Comment