వేమన పద్యం - కసువును దినువాఁడు ఘనఫలంబుల రుచి (మూర్ఖపద్ధతి)
కసువును దినువాఁడు ఘనఫలంబుల రుచి
గానలేడుగాదె వానియట్లు,
చిన్న చదువులకును మిన్నజ్ఞానమురాదు,
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: గడ్డివంటి నీచవస్తువులు తినువానికి మంచి పండ్ల రుచి తెలియదు. అట్లే తక్కువ చదువుకున్నవానికి మంచి జ్ఞానము కలుగదు.
No comments:
Post a Comment